Actress Regina : కాస్టింగ్‌లో అన్యాయం..: హీరోయిన్ రెజీనా

సినీ పరిశ్రమలో సౌత్ కంటే నార్త్ వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారని రెజీనా అన్నారు. ‘నేను హిందీ మూవీ ఆడిషన్‌కు వెళ్తే హిందీ బాగా మాట్లాడగలనా? లేదా? టెస్ట్ చేస్తారు. కానీ నార్త్ హీరోయిన్లకు లాంగ్వేజ్ రాకున్నా సౌత్‌లో ఛాన్సులొస్తున్నాయి. కొందరు పెద్ద హీరోయిన్లు అవుతున్నారు. అక్కడా, ఇక్కడా నార్త్ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకే నాకు పాత్రలు రావట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తంచేశారు.
శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి.
సుబ్రమణ్యం ఫర్ సేల్, ఎవరు తప్ప తెలుగులో పెద్దగా విజయాలు దక్కలేవు. అయితే అదే సమయంలో తమిళంలో కూడా పలు అవకాశాలు దక్కించుకుందీ చిన్నది. కాగా ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇండస్ట్రీకి పరిచయమైన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది రెజీనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com