Allu Arjun : అల్లు అర్జున్ ఆ హీరోయిన్ ను వద్దన్నాడా

భారీ ప్రాజెక్ట్స్ అంటే క్రేజీ హీరోయిన్లు కావాల్సిందే కదా. పైగా ప్యాన్ ఇండియా సినిమా అంటే.. అదే రేంజ్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుంటారు.ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. అందుకే అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకుందాం అనుకున్నాడట దర్శకుడు అట్లీ. జాన్వీ ఆల్రెడీ ఎన్టీఆర్ తో దేవర మూవీతో సౌత్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసినా అద్భుతమైన నటి అన్న ప్రశంసలైతే ఇంకా రాలేదు. పైగా హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లోనూ మెరిసిందీ సోయగం. అక్కడా జస్ట్ పాస్ అయింది తప్ప సూపర్బ్ అనిపించుకోలేదు.
మరి ఏమైందో కానీ జాన్వీ కపూర్ ను అల్లు అర్జున్ వద్దనుకుంటున్నాడట. తనకంటే ఇంకా బెటర్ ఛాయిస్ కు వెళదాం అని దర్శకుడితో చెప్పాడట. పైగా తనతో పుష్ప చేసినప్పుడు రష్మిక మందన్నాకు ఏ ఇమేజ్ ఉంది. తర్వాత సెకండ్ పార్ట్ తో తనకు ప్యాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ రాలేదా అని చెప్పాడట.అంతే కాదు.. అవసరమైతే కొత్త హీరోయిన్ తో వెళదాం అన్నాడట కూడా. అందుకూ ఓ ఎగ్జాంపుల్ చెప్పాడు.. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతోన్న ఫౌజీ మూవీలో ఇప్పటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఇమాన్వీ అనే అమ్మాయిని తీసుకున్నారు కదా.. మనమూ అలా వెళదాం అనేశాట్ట.
విశేషం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని టాక్. ఏదో కమర్షియల్ సినిమాల్లో పాటల కోసం అన్నట్టుగా కాక హీరోయిన్ చుట్టూ కథలో కీలకమైన ఘట్టాలుంటాయని టాక్. అందుకే జాన్వీని వద్దంటున్నాడా లేక.. రామ్ చరణ్ తో చేస్తోంది కాబట్టి వద్దనుకుంటున్నాడా అనేది తెలియదు కానీ.. శ్రీదేవి కూతురుతో రొమాన్స్ కు ఐకన్ స్టార్ అంత సుముఖంగా లేడు అంటున్నారు. ఒకవేళ అట్లీ ఇంకేదైనా చెప్పి ఒప్పిస్తే అప్పుడు వస్తుందేమో కానీ ఇప్పటికైతే ఈ సినిమాలో జాన్వీ ఉండబోతోంది అనేది రూమరే అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com