Prabhas : ప్రభాస్ నుంచి మరో ప్రాజెక్ట్ రెడీ అవుతోందా..?

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అన్నీ భారీ ప్రాజెక్ట్ లే. కొత్తవి కాక సీక్వెల్స్ కూడా రెండు పెండింగ్ లో ఉన్నాయి. సలార్ 2, కల్కి 2 కోసం కూడా ఆయా నిర్మాత, దర్శకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ అనే సినిమాలు చేస్తున్నాడు. తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతాడు. ఇవి కాక హొంబలే ఫిల్మ్స్ వారికి కొన్ని సినిమాలు చేసేలా ఒప్పందం కూడా అయింది. ఇందులో భాగంగా ఈ బ్యానర్ లోనే ప్రభాస్ కొత్త సినిమా ఒకటి రెడీ అవుతోంది.
కొన్నాళ్ల క్రితం ప్రభాస్.. ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. హొంబలే ఫిల్మ్స్ లో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కథ మొత్తం సిద్ధం అయిపోయింది. షూటింగ్ మొదలైతే ఆలస్యం అవడకుండా ప్రతి ఫ్రేమ్ ను పక్కాగా రాసుకున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారట. త్వరలోనే ఇతర కాస్ట్ అండ్ క్రూ గురించి ప్రకటించబోతున్నారు అని చెబుతున్నారు. కాకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న మూవీస్ పూర్తయ్యాకే ప్రశాంత్ వర్మ సినిమా సెట్స్ పైకి వెళుతుందట. మరి దానికి ఎన్నాళ్లు పడుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com