Anupama : ఆ కుర్ర హీరోతో అనుపమ డేటింగ్?

'అఆ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కర్లీ హెయిర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో పద్ధతైన పాత్రలు మాత్రమే చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాప్ స్టార్ హీరోలతో మూవీస్ చేయలేకపోయినా.. ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మధ్యలో చాన్స్ ల రాక కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ.. ఎవ్వరూ ఊహించని విధంగా 'టిల్లు స్క్వేర్' లాంటి కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ పాత్రలో మెప్పించింది. తర్వాత అదే జోరును 'డ్రాగన్'తోనూ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో 'పరదా' మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంది. అయితే తాజాగా అనుపమ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తో ఆమె డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట 'బ్లూ మూన్' అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్న ట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'బిసన్' అనే సినిమా చేస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచి త్రంలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు. ఇందులో అనుపమ ఆయన ప్రియురాలి పాత్రలో నటిస్తోంది. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com