Krithi Shetty : బేబమ్మ మళ్లీ వస్తోందా?

ఉప్పెన్ బ్యూటీ కృతి శెట్టికి galattadot.com నుంచి యూత్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ స్టాలో పోస్టు పెట్టిందీ అమ్మడు. ఈ సంవత్సరం తనకెంతో ప్రత్యేకత అంటూ చెప్పుకొచ్చింది. సూపర్ అనే హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈ భామ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ తెచ్చిపెట్టుకుంది. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిందీ ముద్దుగుమ్మ. కర్ణాటకలోని మంగుళూరులో జన్మించిన ఈ అమ్మడు చిన్న వయసులోనే తెరంగేట్రం చేసింది. చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎంత ఫాస్ట్ పీక్స్ చూసిందో.. అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ అయ్యింది. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల ప్లాప్స్ బేబమ్మ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. నాగ చైతన్య కస్టడీతో తనను ఆదుకుంటాడేమో అనుకుంది కానీ.. అది అవ్వదమ్మ అని ఆడియన్స్ డిసైడ్ చేశారు. శర్వానంద్ ను నమ్ముకున్నా సేమ్ సిచుయేషన్. ఇక కెరీర్ ఎటు వెళుతుందా అన్న టైంలో మలయాళ మూవీ ఏఆర్ఎం ఆమెను ప్లాపుల నుండి గట్టెక్కించింది. అయితే ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ మళ్లీ ఏ సినిమాల గా కనిపించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com