Pushpa-2 : పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప..ది రైజ్' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప..ది రూల్' చిత్రంలో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉండనుందట.. తొలి పార్ట్‌లోని ‘ఊ అంటావా మావా' పాటకు స్టార్ హీరోయిన్ సమంత స్టెప్పులు వేయగా.. పుష్ప ది రూల్ కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించారట మేకర్స్.
ఆమె ఎవరో కాదు దిశా పటానీ.. వాస్తవానికి పుష్ప..ది రైజ్ లోనే ఆమె ఐటమ్ సాంగ్ చేయాల్సి్ంది కానీ కుదరలేదు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కు ఈ బ్యూటీ ఓకే చెప్పిందట. తొలి పార్ట్‌లోని పాటను మించేలా అద్భుతమైన మ్యూజిక్ దేవిశ్రీ ఆందిస్తున్నట్లు సమచారం. పుష్ప 2ను నార్త్ ఇండియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తుండడంతో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని స్పెషల్ సాంగ్‌లో నర్తించేలా చిత్ర బృందం ప్లాన్ చేసిందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
మామూలుగానే దిశా పటానీ గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్, బికినీతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడంలో దిశా పటానీ తర్వాతే ఎవ్వరైనా. అలాంటి బ్యూటీకి పాన్ ఇండియా సినిమా పుష్ప2లో ఐటెం సాంగ్ అంటే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పూరీజగన్నాథ్ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఎం.ఎస్.ధోనీ, బాగీ2, బాగీ3, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com