Nidhi Agarwal : నిధి అగర్వాల్ కెరీర్ ముగిసినట్టేనా..?

Nidhi Agarwal :  నిధి అగర్వాల్ కెరీర్ ముగిసినట్టేనా..?
X

నిధి అగర్వాల్ కెరీర్ ముగిసిపోయినట్టేనా.. అంటే అవుననే తెలుస్తోంది. తను ఎంచుకున్న కథలు ఇలాగే చేశాయి. మామూలుగా తనకు మంచి అవకాశాలే వచ్చాయి. అవన్నీ దారుణంగా ఫెయిల్ కావడంతోనే ఇప్పుడిలా కామ్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో సినిమాలు చేసింది. నాగ చైతన్యతో సవ్యసాచి, అఖిల్ అక్కినేనితో మిస్టర్ మజ్ను మూవీస్. బట్ ఆ రెండూ పోయాయి. బట్ ఆ వెంటనే ఇస్మార్ట్ శంకర్ తో ఛాన్స్ వచ్చింది. ఇది బిగ్ బ్లాక్ బస్టర్. అయినా నిధి అగర్వాల్ అకౌంట్ ఆ విజయం పూర్తి స్థాయిలో పడలేదు. ఆపై హీరో అనే మూవీతో చేసింది. అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అసలా మూవీ అనేది ఒకటి ఉంది కూడా అని తెలియలేదు చాలామందికి. ఆ స్థాయిలో డిజాస్టర్ అయింది. ఇక చాలా గ్యాప్ తర్వాత చేసిన హరిహర వీరమల్లు మూవీ సైతం నిరాశపరిచింది. ముగ్గురు హీరోయిన్ల మధ్య ఒకరిలా ఉండేలా చేసిన రాజా సాబ్ మాత్రం డిజాస్టర్ అయింది. మొత్తంగా ఇలా మంచి ఆఫర్లు, పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. అన్నీ పోయాయి. ఆ కారణంగా నిధి అగర్వాల్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టుగానే భావిస్తున్నారు చాలామంది.

ఓ రకంగా చూస్తే నిధి అగర్వాల్ లక్కీ హీరోయిన్. పెద్ద అందగత్తేం కూడా కాదు. టాలెంటూ లేదు. అయినా ఇన్ని మూవీస్ లో అవకాశాలు రావడం మాత్రం చాలా పెద్ద విషయమే. ఆ విషయాన్ని నిలబెట్టుకుని విజయాలు కూడా అందుకుంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. కానీ ఇప్పుడు తన టైమ్ అయిపోయింది. మరో మూవీ వస్తుందా అంటే మాగ్జిమం డౌట్ అనే చెప్పాలి. అయినా ఇక ఆమెను తీసుకోవాలి అనుకుంటే మేకర్స్ ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగని ఈ ఫ్లాపులకు తనేమీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోలేదు. అయితేనేం.. అసలే ఇండస్ట్రీలో ఒకట్రెండు ఫ్లాపుల పడితేనే హీరోయిన్లను లైట్ తీసుకుంటారు. అలాంటిది ఇన్ని ఫ్లాపులే అంటే ఇంక అంతే సంగతులు. అది కూడా దాటింది నిధి. ఏదేమైనా ఇక నిధి అగర్వాల్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టుగానే భావించాలి.

Tags

Next Story