Prabhas : ప్రభాస్ - సందీప్ వంగా ‘స్పిరిట్’ క్యాన్సిల్ అయినట్టేనా..?

సాధారణంగా ఓ సినిమా కమిట్ అయిన తర్వాత మరో ప్రాజెక్ట్ వస్తే.. డేట్స్ ను బట్టి రెండు సినిమాలు ఒకేసారి చేయడం.. లేదా ముందు వచ్చిన కథను ముందే చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు కంటెంట్ ను ఒక కథకు ముందు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే పనిగా ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ ను వెనక్కి నెడుతూ ఉంటే చూసేవారికి అనుమానాలు కలుగుతుంటాయి. అసలు ఈ మూవీ ఉంటుందా లేదా అనే డౌట్స్ కలుగుతుంటాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో వస్తుంది అని చెప్పిన ‘స్పిరిట్’విషయంలో ఇదే జరుగుతుంది.
సందీప్ యానిమల్ కంటే ముందే ఈ కథ ఓకే అయింది. అటు సలార్ తర్వాత ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ నే ఓకే చేయాలి. కాస్త లేట్ అయింది. మారుతితో రాజా సాబ్ కు వెళ్లాడు. నెక్ట్స్ స్పిరిట్ అనుకున్నారు. ఈ దర్శకుడిని వెయిటింగ్ లో పెట్టి ప్రభాస్.. మరో దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ మూవీ చేస్తున్నాడు. సరే ఫౌజీ తర్వాత సందీప్ తోనే అనుకుంటే ఇప్పుడు సందీప్ ను మరింత వెనక్కి నెట్టాడు ప్రభాస్. ఆ స్థానంలో ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను కూడా ఫైనల్ చేసుకున్నారట. అంటే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మరి దానర్థం ఏంటీ.. సందీప్ ను లైట్ తీసుకున్నట్టే కదా..
నిజానికి సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ కు కొన్ని కండీషన్స్ పెట్టాడు అనే న్యూస్ వచ్చాయి కదా ఆ మధ్య. ఆ కండీషన్సే ప్రభాస్ కు నచ్చలేదని.. అందుకే మెల్లగా సందీప్ ను సైడ్ చేస్తున్నాడు అంటున్నారు. నిజానికి సందీప్ చాలా వేగంగా సినిమాలు చేస్తాడు. అతని స్పీడ్ ను అందుకోవడం ప్రభాస్ కు కష్టమే. ఈయన కాస్త లేజీగానే ఉంటారు అని ఇండస్ట్రీ అంతా తెలుసు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు పూర్తిగా నీలి నీడలు కమ్మున్నాయి. దీన్నే పొమ్మనలేక పొగపెట్టడం అంటారేమో కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com