Raja Saab : రాజా సాబ్ కోలీవుడ్ లో ఖతమేనా..?

Raja Saab :  రాజా సాబ్ కోలీవుడ్ లో ఖతమేనా..?
X

రాజా సాబ్ పై కోలీవుడ్ ప్రభావం బలంగా ఉండబోతోందా అంటే అవుననే చెబుతున్నారు. అంటే రాజా సాబ్ తమిళ్ లో పెద్దగా ఆడే అవకాశం లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. మమూలుగా కోలీవుడ్ లో ఈ టైమ్ లో ఇతర భాష చిత్రాలను లైట్ తీసుకుంటారు. అలాంటిదే ఏకంగా విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ ను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. పైగా అతని చివరి సినిమాగా చెప్పారు. అంతేకాక ఆ తర్వాతి రోజు కూడా శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి కూడా విడుదల కాబోతోంది. మామూలుగా ఈ రెండు సినిమాలపైనే గట్టి పోటీ ఉంటోంది. అలాంటిది.. ఈ రెండిటితో పాటు ప్రభాస్ ఎంటర్ అవడం అసాధ్యమే అవుతోంది. కాకపోతే ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పుకునే అవకాశంతో ఏవో కొన్ని థియేటర్స్ మాత్రం అలాట్ చేసే అవకాశం ఉంది. ఆ థియేటర్స్ లో కూడా పెద్దగా సరైన సౌకర్యాలు కూడా ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా రాజా సాబ్ తమిళ్ లో మాత్రం సింపుల్ గా వాష్ అవుట్ అవడం ఖాయం అంటున్నారు.

మామూలుగా అయితే ప్రమోషన్స్ పరంగా కూడా రాజా సాబ్ చాలా వీక్ గా ఉంది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ పరంగా ఎలాంటి చొరవ కనిపించలేదు. కేవలం తెలుగులో వరకు మాత్రం మమ అనిపించారు తప్ప.. ఎలాంటి వీడియోలు ఇతర భాషల్లో ఏం చేయలేదు. హిందీలో మాత్రం దర్శకుడు, హీరో లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం నిర్వహించారు. దానికీ పెద్దగా మైలేజ్ రాలేదు. సో.. మొత్తంగా తమిళ్ లో ఈ జన నాయగన్, పరాశక్తి ధాటికి రాజా సాబ్ నిలబడటం దాదాపు అసాధ్యం.

Tags

Next Story