Sandeep Reddy : సందీప్ రెడ్డి ఫంక్షన్స్ కి రెగ్యులర్ గెస్ట్ అయ్యాడా

సందీప్ రెడ్డి వంగా.. డౌటే లేకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలివబోతోన్న పేరు. ఇప్పటికే మూడు సినిమాలతోనే రెండు ఇండస్ట్రీస్ ను షేక్ చేశాడు. రాబోయే రోజుల్లో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను ఒకేసారి షేక్ చేస్తాడు అనే నమ్మేవాళ్లూ చాలామందే ఉన్నారు. యానిమల్ తర్వాత అతను ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే అప్డేట్ మాత్రం ఎవరికీ చెప్పడం లేదు. అందుకు ప్రభాస్ లైనప్ ఓ కారణం కావొచ్చు. కానీ స్పిరిట్ కంటే చాలా వెనకే కమిట్ అయిన హను రాఘవపూడి ఫౌజీ సెట్స్ లో ఉంది. అంటే సందీప్ ఇంకా ప్రాపర్ స్టోరీ రెడీ చేయలేదా లేక హీరో నిర్ణయానికి తలొగ్గి వెయిట్ చేస్తున్నాడా అనేది తెలియదు. కారణాలు ఏవైనా ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. బట్ ఈ గ్యాప్ లో అతను నిత్యం ఏదో ఒక సినిమా ఫంక్షన్ కు అటెండ్ కావడం అక్కడ తనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి వచ్చిన కొత్తలో తను అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేయలేదు అని చెప్పినా తర్వాత చేశాడు అని తేలింది. తనూ చెప్పాడు. తాజాగా తండేల్ సినిమా ఫంక్షన్ కు వచ్చాడు. తను నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు చైతన్య సెట్స్ కు వచ్చేవాడని.. ఎందుకో నాకు అతనంటే ఇష్టం అని చెప్పాడు. చెప్పడమే కాదు.. తన కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ కాస్ట్యూమ్స్ కి నాగచైతన్య వేసుకునే బట్టలు చూపించేవాడినని చెప్పాడు. ఇది కాస్త అతిశయోక్తిలా అనిపించినా అప్పటికి(వేదికకు) ఇలాంటివి కిక్ ఇస్తాయి. ఇక ఈ చిత్రం గురించి కూడా చాలానే చెప్పాడు. సాయి పల్లవిని అర్జున్ రెడ్డిలో తీసుకుందాం అనుకున్నా అని.. తన మేనేజర్ నో చెప్పాడని.. ఇలా.
కొన్నాళ్ల క్రితం పొట్టేల్ అనే సినిమా విషయంలోనూ చాలా ప్రమోషన్స్ నే చేశాడు. వేదికలపై కూడా ఆ మూవీ టీమ్ కు ఉత్సాహం వచ్చేలా కొన్ని ఎక్కువ మాటలే చెప్పాడు. ఇప్పుడు తండేల్ కూ అదే చేస్తున్నాడు. ఏదేమైనా ఇలాంటి దర్శకులు కేవలం వేదికలకు పరిమితం కావడం ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మను ఆదర్శంగా తీసుకున్నాడేమో కానీ.. కొన్నాళ్లుగా సందీప్ రెడ్డి వంగా సినిమా ఫంక్షన్స్ కు రెగ్యులర్ గెస్ట్ అయిపోయాడు అనేది వాస్తవం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com