Thammudu Movie : తమ్ముడు రిలీజ్ డేట్ ఫిక్స్?

Thammudu Movie : తమ్ముడు రిలీజ్ డేట్ ఫిక్స్?
X

చాలా ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్ హుడ్ తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ ఫ్యాన్స్ 'తమ్ముడు' కోసం ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత అదే దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా, లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీ విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

Tags

Next Story