Mangalavara : మంగళవారం’కు సీక్వెల్ సిద్ధం?

Mangalavara : మంగళవారం’కు సీక్వెల్ సిద్ధం?
X

2023లో చిన్న సినిమాగా వచ్చిన మంగళవారం సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. దాని దర్శకుడు అజయ్ భూపతి ఆ మూవీకి సీక్వెల్ తెరక్కించనున్నట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్‌పుత్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా, దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఎంతో త్రిలింగ్‌గా ఆకట్టుకుంది, ముఖ్యంగా పాయల్ క్యారెక్టర్ కి వంద మార్కులు పడ్డాయి. ఇలాంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందుకే ‘మంగళవారం’ మూవీ హిట్ తో పాయల్‌ కు స్పెషల్ క్రేజీ ఏర్పడింది. అంతేకాదు కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ స్థానంలో కొత్త నటి కనిపిస్తుంది అని. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానుందట. మరి ఈసారి పాయల్ పాత్రలో కనిపించేది ఎవరు ఏంటి అనే అప్ డేట్స్ త్వరలో రానున్నాయి.

Tags

Next Story