Actress Isha Koppikar : నాగార్జున నన్ను 15సార్లు కొట్టాడు

Actress Isha Koppikar : నాగార్జున నన్ను 15సార్లు కొట్టాడు
X

ఇటీవలే నాగార్జునతో తన తొలి తెలుగు చిత్రం 'చంద్రలేఖ' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నటి ఇషా కొప్పికర్ వెల్లడించారు. ఒక సన్నివేశంలో నాగార్జున తనను 15 సార్లు నిజంగా చెంపదెబ్బ కొట్టారని, అది సహజంగా రావాలని తనే కోరినట్లు తెలిపారు. ఆయన మొదట చాలా చిన్నగా కొట్టారని దీంతో ఆ సన్నివేశం సరిగ్గా రాలేదర్నారు. నాకు కోపం రావడం లేదు. మీరు గట్టిగానే కొట్టండని మరోసారి చెప్పానని తెలిపారు. ఆ సీన్‌ బాగా రావడం కోసం రీటేక్‌లు తీసుకున్నారు. దీంతో 14, 15 సార్లు నా చెంపపై గట్టిగా కొట్టారు. సన్నివేశం అయ్యాక చూస్తే.. మొహమంతా కందిపోయింది. చెంపమీద వాతలు పడ్డాయి. దీంతో నాగార్జున బాధపడి క్షమాపణలు చెప్పారని తెలిపారు. సన్నివేశం డిమాండ్‌ చేస్తే ఇలాంటివి సహజమన్నానని చెప్పానని తెలిపారు. ఆమె 1995లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని 'మిస్ టాలెంట్' సబ్-టైటిల్ గెలుచుకున్నారు. 1998లో తెలుగు చిత్రం 'చంద్రలేఖ' తో సినీ రంగ ప్రవేశం చేశారు, ఇందులో నాగార్జున సరసన నటించారు. తెలుగులో తొలి సినిమా తర్వాత, తమిళంలో 'కాదల్ కవితై' చిత్రానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి (తమిళ్) అవార్డు గెలుచుకున్నారు. 2000లో 'ఫిజా' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆమె 'ఖల్లాస్' పాటతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'డాన్', 'క్యో కూల్ హై హమ్', 'కృష్ణ కాటేజ్', 'సలామ్-ఎ-ఇష్క్' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇషా కొప్పికర్ 2009లో వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె రియన్నా ఉంది. అయితే, 2023లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత తన కుమార్తెతో కొత్త జీవితాన్ని ప్రారంభించి, పనిపై దృష్టి పెడుతున్నారు.

Tags

Next Story