Janhvi Kapoor : అది నన్ను బాధిస్తోంది.. జాన్వీ కపూర్ తీవ్ర ఆందోళన

భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో నెలకొన్న డ్రోనాడులు, గందరగో ళం తనను ఎంతో బాధించాయని ఇన్స్టా వేదికగా పేర్కొంది. 'ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అను భవించని ఆందోళన. ఇన్నాళ్లూ విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతి కోసం కోరుకున్నాం. కానీ.. ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వదు. దశా బ్దాలుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న తర్వాత.. ఇప్పుడు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మనది దూకుడు కాదు.. దశాబ్దాల బాధకు సమాధానం. మన సాయుధ దళాలు శత్రుదేశంపై వీరోచిత పోరాటం చేస్తున్నాయి. మనల్ని, మన భూమిని, మన సార్వభౌమ త్వాన్ని మన సైనికులు రక్షిస్తు న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ వారికి మద్దతు ఇద్దాం. దాయది దేశం అరాచకత్వాన్ని ఇకపై చూసీచూడనట్లు ఉండేది లేదని.. గట్టిగా బదులిస్తామని వారికి తెలిసొచ్చే చేద్దాం. ఈ యుద్ధంలో అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం నన్ను బాధి స్తోంది. త్వరలోనే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని ఆశిస్తున్నాను' అంటూ జాన్వీ రాసుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com