Mouni Roy : వారిని చూస్తే జాలేస్తోంది.. మౌనీ రాయ్

నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రణ్ బీర్ కపూర్, ఆలియా చేసిన బ్రహ్మాస్త్ర మూవీలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఆమె చేసిన లేటెస్ట్ మూవీ 'ది భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. సిద్ధాంత్ సన్దేవ్ తెరకెక్కించి ఈ చిత్రంలో సంజయ్ దత్, పాలక్ తివారీ, సన్నీ సింగ్, నవనీత్ మాలిక్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. ఇటీవల న్యూ లుక్ లో కనిపించారు. అయితే, ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారని, కొత్త హెయిర్ స్టైల్ తో దానిని దాచిపెట్టారని నెటిజన్లు ఆరోపిస్తూ కొన్ని ఏఐ వీడియోలను కూడా క్రియేట్ చేసి షేర్ చేశారు. అయితే తన లుక్స్ పై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా మౌనీ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఆన్లైన్ లో నెగిటివ్ ను ప్రచారం చేసే వ్యక్తుల పట్ల తనకు జాలిగా ఉందని పేర్కొంది. హీరోయిన్స్ను అందరూ సులభంగా జడ్జ్ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. 'నేను సోషల్ మీడియాను వాడిన తొలినాళ్లలో నెగెటివ్ కామెంట్స్ చేసేవారి ప్రొఫైల్ ఓపెన్ చేసి వారి గురించి తెలుసుకొని బ్లాక్ చేసేదాన్ని. ఇప్పుడు ఇలాంటి వారిని చూస్తే జాలి వేస్తోంది. నా లుక్ పై వచ్చిన ఎన్నో ఏఐ వీడియోలు చూశాను. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. నా ముఖాన్ని వేరొకరి శరీరానికి అతికించారు. ఆ వీడియోలు చూడ డానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల వారికి ఎలాంటి ఆనందం వస్తుందో నాకు ఇప్ప టికీ అర్థం కాదు. ట్రోల్స్ చేసే వారి లక్ష్యం ఏంటో వారికి కూడా తెలియదు. వారి లైక్ లు కోసం సెలబ్రిటీలపై చెత్త సమాచారమంతా రాస్తారు. వారికి సరైన బుద్ధిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తాను' అంటూ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com