అది ఆమె ఇష్టం.. ఎవరూ ఇబ్బంది పెట్టరు: నయన్ గురించి విశాల్

సౌత్ సినిమాల్లో అత్యంత విజయవంతమైన నటీమణులలో నయనతార ఒకరు. ఆమె తన ప్రత్యేకమైన శైలితో దశాబ్దానికి పైగా చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న జవాన్‌తో బిజీగా ఉంది. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అటు షారుఖ్, ఇటు నయనతార అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే సౌత్ సినిమాలో నయనతార పట్ల కొంత వ్యతిరేకత ఉంది. ఆమె తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదనే విషయం అందరికీ తెలిసిందే.. సినిమా రిలీజ్ కు ముందు ఆమె ఒకటి లేదా రెండు ప్రత్యేక ఇంటర్వ్యూలను మాత్రమే ఇస్తుంది. ప్రెస్ మీట్‌లకు, ఈవెంట్‌లకు నయన్ అస్సలు హాజరుకాదు. ఆమె ఈ నిర్ణయం వెనుక కారణం ఆమె కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఎదురైన చేదు అనుభవమే. అప్పటి నుంచి వాటికి దూరంగా ఉంటోంది.
ఇటీవల, మార్క్ ఆంటోని ప్రమోషన్స్‌లో మీడియా ప్రతినిధులు విశాల్‌ను సినిమా ప్రమోషన్‌లలో నయనతార లేకపోవడంపై అతని అభిప్రాయాలను అడిగారు. ఇది నయనతార వ్యక్తిగత నిర్ణయమని, ఆమెని రమ్మని ఎవరూ బలవంతం చేయరని విశాల్ చెప్పాడు. అయితే నిర్మాతలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తారు.. అందులో నటించిన తారలు ప్రమోట్ చేస్తేనే ఆ సినిమా జనాలకు మరింత చేరువవుతుంది. అందుకోసం నటీనటులు ప్రమోషన్లకు రావలసిన అవసరం ఉంది అని విశాల్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. నయన్ కూడా సినిమా ప్రమోషన్లకు హాజరైతే మంచిది అని సూచించాడు.
విశాల్, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రాన్ని వినాయక చవితికి పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com