Tollywood : జైలర్ 2లో మామాఅల్లుళ్ల

Tollywood : జైలర్ 2లో మామాఅల్లుళ్ల
X

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరికొత్త క్యారెక్టరైజేషన్ లో రజిని పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దర్శకుడు నెల్సన్ టేకింగ్, సూపర్ స్థార్ రజిని స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుద్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ వెరసి జైలర్ సినిమాను బ్లాక్ బస్టర్ స్థాయిలో నిలబెట్టాయి. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. జైలర్ 2లో రజనీకాంత్ తోపాటు ధనుష్ కూడా కనిపించనున్నాడట. ఈ క్రేజీ సీక్వెల్ లో ధనుష్ కోసం ఓ పవర్ ఫుల్ పాత్రను క్రియేట్ చేశారట. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి మామ అళ్ళుల్లు కలిసివస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.

Tags

Next Story