Jailer 2 Promo : జైలర్ 2 ప్రోమో వచ్చేస్తోంది!
X
By - Manikanta |29 Nov 2024 12:30 PM IST
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన మూవీ జైలర్. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే జైలర్ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 5 నుంచి జైలర్ 2 ప్రోమో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అలాగే డిసెంబర్ 12న తలైవా రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా జైలర్ 2 మూవీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయ నున్నారని టాక్. దీంతో రజినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com