Tollywood : ఎన్టీఆర్తో జైలర్ డైరెక్టర్

Tollywood : ఎన్టీఆర్తో జైలర్ డైరెక్టర్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఊపులోనే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ సినిమా తరువాత ఎన్టీఆర్ జైలర్ దర్శకుడు నెల్సన్ కుమార్ తో జతకట్టనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని టాక్. ఇక జైలర్ రేంజ్ లో ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ అవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story