Janhvi Kapoor : మెరిసిపోతున్న జాన్వీకపూర్.. ఫొటోలు వైరల్

Janhvi Kapoor : మెరిసిపోతున్న జాన్వీకపూర్.. ఫొటోలు వైరల్
X

హే.. ముత్యవల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా.. అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా అన్నారో సినీ కవి. కేన్స్ 2025 వేదికపై అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ అలా మెరిసిపోతోంది. మొట్టమొదటి సారి జాన్వీ కపూర్ కేన్స్ లో ఆరంగేట్రం చేసింది. కేన్స్ లో తాను నటించిన 'హోమ్ బౌండ్ ' స్క్రీనింగ్ లో ఈ అద్భుతమైన లుక్ తో కనిపించింది. జాన్వీ ఈ కొత్త రూపంతో మతులు చెడగొడుతోంది. చూడటానికి కొంచెం సింపుల్ గా ఉన్నా కానీ, ముత్యాలు బీడ్స్ తో ఈ పొడవాటి లెహంగాను సర్వాంగ సుందరంగా డిజైనర్ మలిచారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని దీనిని డిజైన్ చేసారు. ఈ లుక్ లో గ్రేస్ ఉంది. గ్లామర్ ని సంప్రదాయ బద్ధంగా ఎలివేట్ చేసే నైపుణ్యం కనిపించింది. ధడక్ తో ఆరంగేట్రం చేసిన జాన్వీ సహనటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కేన్స్ 2025లో సందడి చేస్తుండడం విశేషం. అతడు విశాల్ జెత్వా కూడా జాన్వీతో పాటు కేన్స్ లో సందడి చేస్తూ కనిపించారు. ఈ ముగ్గురూ కేన్స్ 2025 లో 'హోమ్ బౌండ్ ప్రపంచ ప్రీమియర్ కోసం ఆత్రు తగా కనిపించారు. ఈ ఉత్సవాల్లో జాన్వీ కపూర్ గురూజీ, ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు.

Tags

Next Story