Janhvi Kapoor : ఇంకొకరికి నో చాన్స్

Janhvi Kapoor : ఇంకొకరికి నో చాన్స్
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంటే కుర్రాళ్లకు పిచ్చి క్రేజ్. అలనాటి నటి శ్రీదేవి కూతురిగాను ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినా ఆమెకు అంతగా కలిసి రాలేదు. దీంతో తన తల్లికి ఎంతో కలిసివచ్చిన

టాలీవుడ్ దారినే జాన్వీ ఎంచుకుంది. మొదటి ప్రయత్నంలోనే జూ.ఎన్టీఆర్ చేసిన దేవర మూవీలో లక్కీ చాన్స్ కొట్టేసింది. దాని తర్వాత జాన్వీ మరో మూవీతో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. రాంచరణ్16వ సినిమాలో ఉమెన్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. అందులో రాంచరణ్ కు జోడీగా జాన్వీ కనిపించబోతుంది. అయితే సినిమాలో రెండో హీరోయిన్ ఉంటుందని ప్రచారం జరిగినా.. అందంతా పుకార్లేనని తెలింది. దీంతో ఇప్పటి నుంచే ఈ మూవీపై అభిమానుల్లో హైప్ క్రియేట్ అవుతోంది.

Tags

Next Story