Janhvi Kapoor : తిరుపతిలో పెళ్లి చేసుకుంటా.. ముగ్గురు పిల్లలను కంటా.. జాన్వీ కపూర్ కామెంట్స్

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ షోలో ప్యాన్ ఇండియా హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. భర్త, ముగ్గురు పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలనుందని తెలిపింది. ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తింటూ... గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని చెప్పింది. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఉందని తెలిపింది. జాన్వీ కపూర్ కు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనానికి వస్తుంటుంది.
శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి వచ్చిన జాన్వీ కపూర్ తన టాలెంట్ తో అగ్రనటిగా ఎదిగింది. పాన్ ఇండియా సినిమాలతో ఆమె ఎంతో బిజీగా ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. తారక్ తో 'దేవర2', రామ్ చరణ్ తో 'ఆర్సీ 16' సినిమాలు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com