Janvi Kapoor Film : టొరంటో ఫెస్టివల్‌కు జాన్వీకపూర్‌ సినిమా

Janvi Kapoor Film : టొరంటో ఫెస్టివల్‌కు జాన్వీకపూర్‌ సినిమా
X

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన చిత్రం 'హోమ్ బౌండ్' ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) 2025కు ఎంపికైంది. ఈ చిత్రాన్ని గాలా ప్రజెంటేషన్ విభాగంలో అధికారికంగా ఎంపిక చేశారు. 'హోమ్ బౌండ్' చిత్రం ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక కావడం ద్వారా ఈ సినిమాకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించనుంది. బాల్య స్నేహితులుగా ఉన్న ఇద్దరు యువకులు పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. వారి లక్ష్యానికి దగ్గర పడే కొద్దీ వారి మధ్య పెరిగిన దూరం, మత, సామాజిక నేపథ్యాలు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత పోరాటాలు వంటి అనేక అంశాలను దర్శకుడు సున్నితంగా తెరపై చూపించారు. ఈ సినిమాకు విడుదల కాకముందే ఇన్ని అంతర్జాతీయ గౌరవాలు లభించడం చిత్ర బృందానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని టీమ్ తెలిపింది.

Tags

Next Story