NTR : వరద బాధిత సహాయం ప్రకటించిన తారక్.. ట్వీట్ వైరల్

టాలీవుడ్ అగ్రనటుడు తన పెద్దమనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితులకు నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఎక్స్‌లో ఈ సమాచారం ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందన్నారు.
అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు తారక్. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తారక్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మరింత మంది తారలు స్పందించాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com