Jr NTR : ఎన్టీఆర్ వాచ్ రూ.3.45 కోట్లు

వార్-2 ప్రమోషన్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా నిలిచాడు. ఆయన ఎమోషన్స్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. అయితే అందరి కళ్లూ ఆయన వాచీ మీద పడ్డాయట. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీ ఆర్ కు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆ విషయాన్ని స్వయంగా ఆయన పలు సం దర్భాల్లోనూ చెప్పాడు. లేటెస్ట్ గా వార్ 2 ఈవెంట్ కు కూడా ఓ ఖరీదైన వాచ్ ను ధరించి వచ్చాడు తారక్. ఇక ఈ వాచ్ బ్రాండ్ తో పటు దాని ధర ఏంటని గూగుల్ లో సెర్చ్ లు మొదలయ్యాయి. కాగా ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ 'అడిమార్స్ పిగుట రాయల్' బ్రాండ్ వాచ్. దాని ధర అక్షరాలా మూడు కోట్ల, నలభై ఐదు లక్షల డెబ్భై ఏడువేల ఎనిమిదివందల ఒక్క రూపాయి (రూ. 3.45 కోట్లు). ఈ ఖరీదుతో ఒక చిన్న సినిమా కూడా తీయచ్చు అని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com