'Ka' Movie : మలయాళంలో 'క' వచ్చేస్తోంది

Ka Movie : మలయాళంలో క వచ్చేస్తోంది
X

కిరణ్ అబ్బవరం 'క' మూవీ మలయాళంలోనూ రిలీజ్ చేయబోతున్నారు. సుజిత్ సందీప్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్ల లో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. తెలుగులో సూపర్హిట్గా నిలిచిన

క మూవీని తాజాగా మలయాళంలోనూ ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్ను షేర్ చేశారు. మాలీవుడ్లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Tags

Next Story