Kajal Aggarwal : జ్ఞాన ప్రసూనాంబికగా కాజల్ అగర్వాల్

పెళ్లి తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది కాజల్ అగర్వాల్. కాకపోతే తను ఆశించిన విజయాలు రాలేదు. అయితే కెరీర్ లో ఫస్ట్ టైమ్ దేవత పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అది కూడా కన్నప్ప చిత్రంలో. విష్ణు మంచు టైటిల్ పాత్ర పోషిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనేక సంచలనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక పాత్రలు పోషించే ఆర్టిస్టుల విషయంలో విష్ణు సెలక్షన్ కు అంతా శెభాష్ అంటున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు కనిపిస్తున్నారీ చిత్రంలో. ఇక తాజాగా కాజల్ అగర్వాల్ పాత్రను పరిచయం చేస్తూ ఓ ఫోటో విడుదల చేశారు.
‘ముల్లోకాలను ఏలే అమ్మ.. భక్తులను కాపాడే త్రిశక్తి.. కాళహస్తిలో వెలసిన జ్ఞాన ప్రసూనాంబిక..’ అంటూ ఆమె పాత్రను పరిచయం చేశారు. దీన్ని బట్టే కాజల్ పార్వతీదేవిగా నటిస్తోందని అర్థం అవుతోంది కదా. అక్షయ్ కుమార్ పరమశివుడుగా నటిస్తున్నాడీ చిత్రంలో.
మొత్తంగా విష్ణు.. ఈ మూవీతో దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించబోతున్నాడు అని మాత్రం అర్థం అవుతుంది. కమర్షియల్ గా ఎలాంటి విజయం సాధిస్తుందో కానీ.. ఈ ఆర్టిస్టుల కారణంగా భారీ ఓపెనింగ్స్ మాత్రం తెచ్చుకుంటాడు. కాకపోతే టీజర్ చూసిన తర్వాత అతని పాత్రే కాస్త తేడా అనిపిస్తోందంటున్నారు. ఒకప్పుడు ఇదే సినిమా కృష్ణంరాజు భక్త కన్నప్పగా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరి సక్సెస్ కన్నప్పకూ వస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com