Kajal Aggarwal: అతనే నా క్రష్.. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ అంటే అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. చందమామ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. మెగాస్టార్ రామ్ చరణ్ తో మగధీర, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య2 లాంటి సినిమాలల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. వీరితోపాటు చాలామంది స్టార్ హీరోలతో ఛాన్స్ కొచ్చేసింది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. తన రెండో ఇన్నింగ్స్ స్టార్ చేసింది. మంచి క్యారెక్టర్స్ ని ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో దూసుకెళ్తోంది. అయితే పెళ్లి అవకముందు కాజల్ అగర్వాల్ కి టీమిండియా క్రికెటర్ ఒకరు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అతనే తన క్రష్ అని తెలిపింది. అతను ఎవరో కాదు టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. 'రోహిత్ శర్మపై ఒకప్పుడు క్రష్ ఉండేది. రోహిత్ లోని నాయకత్వ లక్షణాలు, ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. అతను బ్యాటింగ్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బరిలోకి దిగితే డబుల్ సెంచరీ కొట్టందే ఫీల్డ్ బయటకు రాని అతని తెగువ ఎంతో గొప్పది. రోహిత్ ఆడే మ్యాచ్ లను మిస్ అవ్వకుండా చూస్తుంటా. నేనే కాదు.. మా ఇంట్లో అందరూ రోహిత్ అభిమానులమే' అంటూ తన అభిమాన క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com