Kajal Aggarwal : రామాయణలో మండోదరిగా కాజల్ ?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించి మెప్పించింది. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ చిత్రంలోనూ నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాలో లక్కీ చాన్స్ కొట్టేసినట్లు తె లుస్తోంది. స్టార్ హీరో రణబీర్ కపూర్, హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న 'రామాయణ'లో కాజల్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. రావణుడి భార్య మండోదరి పాత్రలో ఈబ్యూటీ కనిపిస్తుందని సమాచారం. మరోవైపు కాజల్గత వారమే తన లుక్స్ట్చే యించుకుందని టాక్. ఇక నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కేజీఎఫ్ గా స్టార్ యశ్ రావణుడిగా నటిస్తు న్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్ రవి దూబే, కైకేయిగా లారా దత్త, హనుమంతుడిగా సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తు న్నారు. ఈ ప్రాజెక్టు రెండు పార్టులుగా రాబోతోంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా నవంబర్ లో రిలీజ్ చే సేం దు కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com