Kannappa : ‘కన్నప్ప’లో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ కాజల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ 2025, ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీలోని పలు కీలక పాత్రల తాలూకు పోస్టర్లను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు పిల్లలు కూడా నటించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com