Peddi Movie : పెద్ది లో కాజల్ స్పెషల్ సాంగ్?

Peddi Movie : పెద్ది లో కాజల్ స్పెషల్ సాంగ్?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాజల్‌ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్. పెళ్లి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కాజల్.. ఇటీవలే సల్మాన్, రష్మిక కలిసి నటించిన సికందర్ మూవీలో కనిపించింది. అలాగే ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప మూవీలో పార్వతి పాత్రలో కనిపించనుంది కాజల్. అలాగే ఇప్పుడు పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ నడుస్తుంది.

Tags

Next Story