Bollywood Kajol : నాపై చాలా రూమర్స్ వచ్చాయి : హీరోయిన్ కాజోల్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో పత్తి'. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనపై వచ్చిన గాసిప్స్ గురించి చెప్పుకొచ్చింది. "నాపై చాలా రూమర్స్ వచ్చాయి. పర్సనల్ విషయాల్లోనూ పుకార్లు రాశారు. ఓ సారి గుర్తుతెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి ‘విమాన ప్రమాదంలో మీ కూతురు చనిపోయారు’అని చెప్పాడు. ఇంట్లోవాళ్లు చాలా కంగారు పడ్డారు. ఆ మధ్య కూడా నేను చనిపోయినట్లు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. అయితే ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ఏదైనా ఇబ్బందికర వార్తలు రాస్తే..నా ఫ్రెండ్స్ నాకు పంపిస్తుంటారు. వాటిని చదివి ఇలా ఎలా రాస్తారు? అనుకుంటాను. అంతేకానీ పెద్దగా పట్టించుకోను" అని కాజోల్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com