Prabhas Kalki : కల్కి ఓటిటి డేట్ ఫిక్స్
ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ కల్కి ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. జూన్ 27న విడుదలైన కల్కి ఏడి 2898 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మరో లోకానికి తీసుకువెళ్లింది. ప్రధానంగా కథను మోసింది అశ్వథ్థామ పాత్రధారి అయిన అమతాబ్ బచ్చన్ అయినా.. ప్రభాస్ ఛరిష్మాతోనే ఓపెనింగ్స్ వచ్చాయి. కమల్ హాసన్, దీపికా పదుకోణ్, శోభన, పశుపతి, దిశా పటానీ వంటి భారీ తారాగణం కూడా ఉండటంతో ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా అనిపించిందీ మూవీ. సినిమా ఆరంభంలోనూ, చివర్లోనూ వచ్చిన కురుక్షేత్రం ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే టికెట్ రేట్ భారీగా ఉండటంతో మళ్లీ మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులు కాస్త వెనక్కి తగ్గారు. అయితేనేం ఇప్పుడు ఓటిటిల్లో చూసేందుకు ఆతృతగా ఉన్నారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22 నుంచి కల్కి మూవీ స్ట్రీమ్ కాబోతోంది. ప్రైమ్ లో కేవలం సౌత్ లాంగ్వెజెస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఒకట్రెండు రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో నార్త్ లాంగ్వెజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. సో.. కల్కి ఫ్యాన్స్ ఇక ఎన్నిసార్లైనా ఈ మూవీని చూసుకోవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com