Kalki 2898 AD Official OTT Date : కల్కి ఓటిటి డేట్ ఇదే
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898ఏడి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎవరూ ఊహించని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్.. ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులను కూడా వెళ్లేలా మెస్మరైజ్ చేశాడు. అందుకే ఈ మూవీ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇప్పటికీ థియేటర్స్ లో చాలా చోట్ల స్ట్రాంగ్ గానే ఉంది.
థియేటర్స్ లో ఆల్రెడీ చూసినవాళ్లు కూడా మరోసారి ఓటిటిలో చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే కల్కి ఓటిటిలో ఎప్పుడు విడుదలవుతుందనే క్లారిటీ చాలామందిలో లేదు. వారికోసమే ఈ అప్డేట్. కల్కి మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 23 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ముందుగా ఆగస్ట్ 15 అనుకున్నా.. థియేటర్స్ లో ఇంకా బాగానే రన్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే అమెజాన్ ప్రైమ్ లో రీజినల్ లాంగ్వెజెస్ లోనే స్ట్రీమ్ అవుతుంది. హిందీ వెర్షన్ రెండు రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందట. సో.. ఇక కల్కికి ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com