Kalki 2898AD OTT Release : ఆగస్ట్ 15 నుంచే కల్కి స్ట్రీమింగ్ ..?

Kalki 2898AD OTT Release : ఆగస్ట్ 15 నుంచే కల్కి స్ట్రీమింగ్ ..?
X

డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో మరోసారి వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్టర్ చేసిన ఈ ఫిక్షనల్ మైథాలజీకి వాల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అశ్వథ్థామగా అమితాబ్ నటన, దీపికా పదుకోణ్, కమల్ హాసన్ పాత్రలు బలంగా ఎష్టాబ్లిష్ కావడంతో పాటు చివర్లో కర్ణుడుగా ప్రభాస్ ఎపిసోడ్ నాన్ స్టాప్ విజిల్స్ కొట్టించింది. విజయ్ దేవరకొండ, రాజమౌళి స్పెషల్ అప్పీరియన్స్ లు కూడా ఎసెట్ గా నిలిచాయి. రిలీజ్ అయ్యి నెల దాటినా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా బుక్ మై షోలో రికార్డ్ బుకింగ్స్ అవుతున్నాయి. అయితే ఇలాంటి మూవీని మళ్లీ మళ్లీ చూడాలంటే ఓటిటియే మార్గం. అందుకే కల్కి ఓటిటి రిలీజ్ ఎప్పుడా అని వాల్డ్ వైడ్ గా సెర్చ్ చేస్తున్నారు. వారికోసమే ఈ న్యూస్.

కల్కి మూవీ ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ రీజియన్ లాంగ్వేజెస్ కు దక్కించుకుంది. హిందీలో నెట్ ఫ్లిక్స్ విడుదల చేయబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కల్కి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఓ రెండు రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియన్స్ కోసం స్ట్రీమ్ కాబోతోంది.సో.. ఇండిపెండెన్స్ డే నుంచి అన్ని రీజియన్ లాంగ్వేజెస్ లో కల్కి ఓటిటిలోకి అందుబాటులోకి రాబోతోందన్నమాట. మరి ఈ మూవీ ఓటిటిలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags

Next Story