Kangan Cafe : హిమాలయాల్లో కంగన్ కేఫ్ ఓపెన్

Kangan Cafe : హిమాలయాల్లో కంగన్ కేఫ్ ఓపెన్
X

బాలీవుడ్ నటి, హిమాచల్ ఎంపీ కంగన రనౌత్ వ్యాపారం ప్రారంభించారు. ఫుడ్ బిజినెస్ మొదలుపెడుతున్నానని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. 'ది మౌంటైన్ స్టోరీ' పేరుతో హిమాలయాల్లో కేఫ్ ఏర్పాటుచేశారు. ఫిబ్రవరి 14 నుంచి ఇది ప్రారంభం కానుంది. ఈమేరకు రెస్టారెంట్ ఫోటోలను షేర్ చేశారు. సంప్రదాయ హిమాచల్ ఫుడ్ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటుచేశానని తెలిపారు. తన చిన్ననాటి కల ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని చెప్పారు. ‘హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ.. ఇదొక ప్రేమకథ' అని ఆమె పేర్కొన్నారు. కంగనారనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' ఇటీవల విడుదలైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందిరాగాంధీ గా కంగనా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు. ఎన్నో ఇబ్బందుల మధ్య గత నెల 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వచ్చింది.

Tags

Next Story