Emergency Banned : బంగ్లాదేశ్ లో కంగనా... ఎమర్జెన్సీ బ్యాన్!

Emergency Banned : బంగ్లాదేశ్ లో కంగనా... ఎమర్జెన్సీ బ్యాన్!
X

మాజీ భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ నటి, ఎంపీ కంగన రనౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు అడుగడుగునా వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమాను బంగ్లాదేశ్ లో నిషేధించారు. పా కిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విభజించడంలో ఇందిర చురుకైన పాత్ర పోషించారు. 1971 యుద్ధంలో భారతదేశం పాల్గొనడంతో చివరికి అది బంగ్లాదేశ్ ఏర్పాటుకు పరిస్థితి దారితీసింది. అత్యవసర పరిస్థితిలో 1971 బంగ్లాదేశ్ స్వాతం త్ర యుద్ధంలో భారత సైన్యం, ఇందిరాగాంధీ త్ర్య ప్రభుత్వ పాత్రను బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ ఎంతగానో కీర్తించారు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత 'ఇందిరా గాంధీ దేవత దుర్గ" అని రెహాస్ సంబోధించారు. కొంత కాలంగా బంగ్లా దేశ్ తో ఇండియా సంబంధాలు నీటి మూటలా మారాయి. రకరకాల కారణాలతో ఇప్పుడు ఎమ ర్జెన్సీ సినిమాని బంగ్లాదేశ్ లో రిలీజ్ చేయకూడ దని ఆంక్షలు విధించారని తెలుస్తోంది.

Tags

Next Story