మీకో నమస్కారం.. మీ చిత్రాల్లో నాకు అవకాశం ఇవ్వకండి: సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చిన కంగనా

మీకో నమస్కారం.. మీ చిత్రాల్లో నాకు అవకాశం ఇవ్వకండి: సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చిన కంగనా
సమాజం ఇంకా భ్రష్టు పట్టి పోవడానికి తమ వంతు కృషి చేయాలని కంకణం కట్టుకుంటారేమో కొందరు..

సమాజం ఇంకా భ్రష్టు పట్టి పోవడానికి తమ వంతు కృషి చేయాలని కంకణం కట్టుకుంటారేమో కొందరు.. మంచి చెడు, మానవత్వం.. మనుషుల్లో ఏమీ మిగలకూడదని అహర్నిశలు కృషి చేసి అందంగా తెరపై చూపించాలని ఆరాట పడుతూ 'యానిమల్' లాంటి సినిమాలను సమాజం మీదకు వదులుతుంటారు.. తాము చేసింది చాలా మంచి పని అని తమకు తామే భావించుకుంటారు.. ఆ సమాజంలోనే తమ భార్యా పిల్లలు, అక్క చెల్లెళ్లు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండదేమో.. డబ్బు సంపాదించడానికి సినిమాని ఒక మాధ్యమంగా వాడుకుంటారు.. ఇలాంటి సినిమాలను బ్లాక్ బస్టర్ చేస్తుంటారు పిచ్చి జనాలు.. వాళ్లు చూస్తున్నారనేగా మేము తీస్తున్నామని సదరు దర్శకులు తాము చేసిన తప్పేమీ లేదంటారు.. సమాజం మంచి చూపిస్తే మంచే చూస్తుంది.. చెడు చూపిస్తే చెడే చూస్తుంది.. ఇలాంటి సినిమాలను అస్సలు అంగీకరించని బాలీవుడ్ నటి కంగన కూడా ఇదే విషయంపై వ్యాఖ్యలు చేసింది.

సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగనా రనౌత్‌ను ప్రశంసించారు.. ఆమె యానిమల్ సినిమాపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “నాకు అవకాశం వస్తే, ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే, నేను వెళ్లి కథను వివరిస్తాను. నేను ఆమె సినిమాలు చాలా చూశాను, ఆమె నటన నాకు చాలా ఇష్టం. కాబట్టి ఆమె యానిమల్ గురించి నెగిటివ్ కామెంట్ చేసినా, నేను పట్టించుకోను. నాకు కోపం కూడా రాదు” అని చాలా కూల్ గా మాట్లాడారు.

ఇంటర్వ్యూలో సందీప్ చేసిన వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చింది. వ్యంగ్య రీతిలో స్పందించింది. “సమీక్షలు, విమర్శలు ఒకేలా ఉండవు. ప్రతి కళను సమీక్షించాలి మరియు చర్చించాలి - ఇది సాధారణ విషయం. నా రివ్యూ చూసి నవ్వుతూ సందీప్ జీ నా పట్ల గౌరవం చూపించిన తీరు చూస్తే ఆయన మ్యాన్లీ సినిమాలే కాదు, ఆయన యాటిట్యూడ్ కూడా మ్యాన్లీ అని చెప్పొచ్చు.

ధన్యవాదాలు సందీప్ జీ అంటూ.. కంగనా “ దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి. లేకపోతే, మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు, ఆపై మీ సినిమాలు కూడా ఆడవు. మీరు బ్లాక్ బస్టర్లు చేస్తారు. సినిమా పరిశ్రమకు మీలాంటి వాళ్లు కావాలి అని తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

అంతకుముందు, కంగనా రనౌత్ ఒక అభిమాని రాసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ.. “నా చిత్రాలకు ప్రతికూలత ఎక్కువగా ఉంది, నేను ఇప్పటివరకు చాలా పోరాడుతున్నాను, కానీ ప్రేక్షకులు కూడా స్త్రీలను సెక్స్ వస్తువులుగా భావించే చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. మహిళా సాధికారత చిత్రాల కోసం జీవితాన్ని అంకితం చేస్తున్న వ్యక్తిని ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. స్త్రీని విలాసవస్తువుగా కాక, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తిగా చూపించే చిత్రాల్లో నటించాలనుకుంటున్నాను.

యానిమల్ విడుదలై రెండు నెలలు గడిచిపోయింది. అయితే ఈ చిత్రం మరియు దాని దర్శకుడు ఇద్దరూ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నారు ఎక్కువగా ప్రతికూల కారణాల వల్ల. జావేద్ అక్తర్, అనుపమ చోప్రా, కిరణ్ రావు వంటి ప్రసిద్ధ వ్యక్తులు దర్శకుడి దృష్టి కోణాన్ని విమర్శించారు. అతడి చిత్రాలలో స్త్రీ పాత్రల చిత్రణ అత్యంత జుగుప్సాకరంగా ఉంటుందని, ఇది స్త్రీల పట్ల అతడికి ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందరు చేసినా సందీప్ ఇంటర్వ్యూలలో తన చర్యలను సమర్థించుకుంటాడు.

యానిమల్ బాక్సాఫీస్ కలెక్షన్

డిసెంబర్ 1, 2023న విడుదలైన అనిల్ కపూర్, రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రీ నటించిన యానిమల్ భారీ విజయాన్ని సాధించింది, 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. యానిమల్ 2023లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story