Kangana : ప్రజాసేవ గురించి ఆలోచించలేదు.. కంగనా సంచలన వ్యాఖ్యలు

Kangana : ప్రజాసేవ గురించి ఆలోచించలేదు.. కంగనా సంచలన వ్యాఖ్యలు
X

రాజకీయాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితాన్ని అంతలా ఆస్వాదించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. కొత్త పాత్రలో ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంద్నారు. ‘‘ రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడం. నేను గతంలో ప్రజలకు సేవ గురించి ఆలోచించలేదు’’ అని చెప్పారు. చిన్న చిన్న విషయాలకు జనాలు తన వద్దకు వస్తున్నారని.. అది తన పరిధి కాదని చెప్పినా వినడం లేదని అన్నారు. ఎంపీగా ఉండి పంచాయతీ స్థాయి సమస్యలు పరిష్కరించమంటే ఎలా అని ప్రశ్నించారు.

భవిష్యత్తులో ప్రధాని వాలనే ఆశ ఉందా అని కంగనాను ప్రశ్నించగా.. ఆ పదవికి తాను తగిన వ్యక్తిని కాదని చెప్పారు. ‘‘నాకు ప్రజాసేవ నేపథ్యం లేదు. నేను చాలా స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపాను. కాబట్టి ఆ పదవికి నేను అర్హురాలిని కాను’’ ఆమె నిజాయతీగా ఒప్పుకున్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగనా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయగా.. చివరకు పార్టీ కూడా ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags

Next Story