Kannaappa : కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ 17న రిలీజ్

Kannaappa : కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ 17న రిలీజ్
X

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా సినిమా 'కన్నప్ప'. మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్లాల్, కాజల్, అక్షయ్కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రమిది. అయితే ఈనెల 25న దీనిని థియేటర్లలో విడుదల చేయాలని తొలుత టీమ్ భావించింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో వాయిదావేసింది. తాజాగా సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 17న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు పేర్కొన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు నటుడు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం లక్నో చేరుకున్న వారిద్దరూ ముఖ్యమంత్రిని కలిసి ‘కన్నప్ప' విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా 'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు.

Tags

Next Story