Kannaappa Team : కన్నప్ప సినిమాపై ట్రోల్స్.. టీం సీరియస్

సోషల్ మీడియాలో తమ సినిమాపై ట్రోల్స్ చేయడంపై కన్నప్ప టీం సీరియస్ అయ్యింది. ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు అన్నీ తెలుసని కథానాయకుడు మంచు విష్ణు అన్నారు. తాజాగా 'బుక్ మై షో' ఆధ్వర్వంలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్లో విష్ణు మాట్లాడారు. 'నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒక వాక్యం కట్ చేసి వైరల్ చేసి వివాదం సృష్టించాలనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా స్మార్ట్. కొంచెం వివాదమైనా పూర్తి వీడియోను చూసి నిజానిజాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత న్యూసెన్స్ అనుకుంటున్నారు' అని విష్ణు సమాధానం ఇచ్చారు. ఆ వేదికపైనే ఉన్న నటుడు రఘుబాబు మైక్ అందుకుని, ట్రోల్స్ పై కాస్త ఘాటుగానే స్పందించారు. 'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్స్ చేస్తే, శివుడి ఆగ్రహానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి.' అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. ట్రోల్ చేస్తే ఇక ఫినిష్' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'కన్నప్ప' కోసం న్యూజిలాండ్లో 9 వేల ఎకరాల ఫాంను ఆరు నెలలకు అద్దెకు తీసుకున్నట్లు విష్ణు తెలిపారు. అక్కడ షూటింగ్ చేస్తుండగానే తనకు డ్రోన్ తగిలి బలమైన గాయమైందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com