Kannada Actor Darshan : కన్నడ హీరో దర్శన్ తూగుదీపకు భారీ ఊరట

Kannada Actor Darshan : కన్నడ హీరో దర్శన్ తూగుదీపకు భారీ ఊరట
X

కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ ఊరట దక్కింది. తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన దర్శన్ కు రెగ్యులర్ బెయిల్ దొరికింది. ఈ హత్య కేసులో ఇప్పటికే తాత్కాలిక బెయిల్ పై ఉన్న అతడు రెగ్యులర్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు దర్శన్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్శన్ తో పాటు అతడి స్నేహితురాలు పవిత్రగౌడకూ బెయిల్ లభించింది. అలాగే, ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి సైతం బెయిల్ ఇచ్చింది.

Tags

Next Story