Kannappa : కన్నప్ప .. హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

X
By - Manikanta |31 Dec 2024 6:00 PM IST
మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తూ, స్టార్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. మూవీలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, నయనతార, మోనన్ లాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్ లో మూవీని షూట్ చేశారు. సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు రీసెంట్ గా మేకర్స్ తెలిపారు. తాజాగా కన్నప్ప మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. కన్నప్ప మూవీలో హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మూవీలో ప్రీతి ముకుందన్ రాకుమారి నెమలి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com