Kannappa teaser : కన్నప్ప టీజర్ డేట్ ఫిక్స్ అయింది

Kannappa teaser :  కన్నప్ప టీజర్ డేట్ ఫిక్స్ అయింది
X

విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ టైటిల్ పాత్రలో నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం చేస్తున్నాడు. 1970ల్లో కృష్ణంరాజు రూపొందించిన భక్త కన్నప్ప చిత్రానికి రీమేక్ లాంటిది అనుకోవచ్చు. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో వేటాడి జీవించే తిన్నడు అనే వ్యక్తి శివుడి కటాక్షం చేత కన్నప్పగా మారి ఆయన్ని సేవించుకునే కథ ఇది. ఈ కథన న్యూజీలాండ్ లో చిత్రీకరించాడు విష్ణు. అది తన సౌలభ్యం కోసం అన్నాడు అతను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన శివుడికి సంబంధించిన పాట ఏకంగా 80మిలియన వ్యూస్ కు పైగా సంపాదించుకుంది.

ఇక త్వరలోనే కన్నప్ప టీజర్ ను విడుదల చేయబోతున్నారు. మార్చి 1న ఈ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్ తో కన్నప్ప చిత్రంపై ఓ అంచనాకు రావొచ్చు. ఇక అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో ప్రభాస్ నందిగా నటించారు. కాజల్ పార్వతిగా కనిపించబోతోంది. వీరితో పాటు శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం కూడా కీలక పాత్రల్లో నటించారు. ఏదేమైనా విష్ణు ఈ మూవీతో ఓ పెద్ద ఛాలెంజ్ ను ఫేస్ చేయబోతున్నాడు. అందులో నెగ్గుతాడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story