Kannappa : కన్నప్ప ట్రైలర్ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే

X
By - Manikanta |12 Jun 2025 6:15 PM IST
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 13న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే, ఈ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు హీరో మంచు విష్ణు ప్రకటించాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు విష్ణు తెలిపాడు. ఇలాంటి బాధాకర టైమ్ లో ట్రైలర్ రిలీజ్ వేడుక జరుపుకోలేమని చెప్పాడు. అందుకే జూన్ 14న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com