Kannappa Update : కన్నప్ప అప్ డేట్ ... శివుడిగా అక్షయ్ కుమార్..

నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కెక్కుతోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాను మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'మహాభారత' సిరీస్ ని తె రకెక్కించిన ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకు వచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకు వచ్చారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పరమశివుడి పాత్రను పోషిస్తారంటూ మూవీ టీం ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసింది. “ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు” అంటూ ఈ పోస్టర్‌పై ఉంది. ఈ చిత్రం చేస్తుండడం తాను గర్వంగా భావిస్తున్నానని, ఈ దివ్యమైన ప్రయాణంలో తమకు శివుడు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్. కన్నప్ప చిత్రంలో పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే ఆమె లుక్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com