Retro Melody Song : కన్నుల్లోన ఉన్నాయి చూడు.. రెట్రో నుంచి మెలోడీ సాంగ్

Retro Melody Song : కన్నుల్లోన ఉన్నాయి చూడు.. రెట్రో నుంచి మెలోడీ సాంగ్
X

సూర్య, పూజాహెగ్దే జంటగా నటిస్తున్న సినిమా రెట్రో. ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే.. కన్నుల్లోన ఉన్నాయి చూడు.. రంగులు ఏడూ నీ వల్లే అనే రిలీజైన మెలోడీ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను కపిలన్ ఆలపించారు. సూర్య జైలులో ఉన్న సీన్లతో ఈ పాట ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్ అంశాలతో తన కొత్త సినిమా రెట్రోను తెరకెక్కిస్తున్నారు. గా.. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'రెట్రో' మే 1న విడుదల కానుంది. ఇందులో పూజా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సూర్య గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ పవర్ ఫుల్ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.

Tags

Next Story