Katrina Kaif : టాలీవుడ్ లోకి కత్రినా కైఫ్ రీఎంట్రీ

విక్టరీ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి సినిమాలో నటించిన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.. ఈ అమ్మడు ఇప్పుడు అంతగా ఫాం లో లేదు కానీ ఒకప్పుడు అమ్మడు బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బీ టౌన్ ఆడియన్స్ డ్రీం గర్ల్ గా కత్రినా అదరగొట్టేసింది. 2003 భూమ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికీ అదే క్రేజ్ కొ నసాగిస్తోంది. లాస్ట్ ఇయర్ మెర్రీ క్రిస్ మస్ తో అలరించిన కత్రినా కైఫ్ నెక్స్ట్ హౌజ్ ఫుల్ 5 తో రాబోతుంది. పెళ్లైనా ఆమె గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్స్ అంతా కూడా పాన్ ఇండియా మోజులో పడ్డారు. అందుకే తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా సినిమాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలు అలియా భట్, దీపిక పదుకొనె, దిశా పటాని, కియరా అద్వాని, జాన్వి కపూర్ ఇలా అందరు కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ సినిమా చాన్స్ వస్తే చాలు వాలిపోతున్నారు. కత్రిన తొలి సినిమా భూమ్ తర్వాత చేసిన రెండో సినిమానే మల్లీశ్వరి. ఈ భామ విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి సినిమా చేసింది. బాలకృష్ణతో అల్లరి పిడుగు లోనూ నటించిందీ బ్యూటీ. తెలుగులో రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇటు వైపు చూడని కత్రినా ఇన్నాళ్లకు మళ్లీ టాలీవుడ్ మీద ఆసక్తి చూపిస్తోందట. మంచి బజ్ ఉన్న సినిమా.. పాన్ ఇండియా మొత్తం ఊపేసే సినిమా చేయాలని కత్రినా భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com