Kavya Thapar : కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గులేకుండా అడిగాడు : కావ్య థాపర్

టాలీవుడ్ లో కావ్య థాపర్ అంటే పెద్ద పరిచయం లేని పేరు. తన అందం, నటనతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటుంది ఈ పంజాబీ బ్యూటీ. 'ఈ మాయ పేరేమిటో' అనే మూవీతో తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడు మంచి హిట్ అందుకుంది. తర్వాత బాలీవుడ్, కోలీవుడ్లోనూ అవకాశాలు దగ్గించుకుంది. ఇక 'డబుల్ ఇస్మార్ట్', 'విశ్వం' మూవీలతో ఫేమస్ అయింది ఈ భామ. తాజాగా కావ్య థాపర్ తన కెరీర్ తొలిరోజులను గుర్తుచేసుకుంది. అందుకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఒక యాడ్లో ఆఫర్ ఉందంటే ఆయన ఆఫీస్ కు వెళ్లా. నాలుగు పెద్ద యాడ్స్ లో నటించే ఛాన్స్ ఇస్తానని అన్నాడు. ఆ ఆఫర్ మీకు ఖరారు చేయాలంటే మాత్రం.. కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గులేకుండా అడిగాడు. అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. అయినా అదే పనిగా రెట్టిస్తూ ఉండటంతో అక్కడి నుంచి వెంటనే బయటకి వచ్చేశా. నన్ను నటిగా చూడాలన్నది నాన్న కల. అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే నటనపై దృష్టి పెట్టా. పతంజలి, మేక్ మై ట్రిప్ ప్రకటనలలో చేశా.. వాటిని చూసే 'ఈ మాయ పేరేమిటో' ఛాన్స్ వచ్చింది' అని చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com