Kavyathapar : ఆ మాటలకు షాకయ్యా : కావ్యథాపర్

విశ్వం సినిమాలో గోపిచంద్ కు జోడీగా చేసిన కావ్యథాపర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఆమె చేసిన మూవీస్ తక్కువే అయినా ఫ్యాన్స్ దగ్గర మాత్రం తెగ పాపులర్ అయింది. అయితే తనకు జరిగిన ఓ సంఘట నను కావ్య గుర్తుచేసుకుని నవ్వుకుంది. ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన టైంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తనను, కావ్య తల్లిని షాట్ రెడీగా ఉంది రండి అంటూ చెప్పి వెళ్లిపోయాడు. అది విని మేమిద్దరం షాకయ్యామని చెప్పుకొచ్చింది. అసి స్టెంట్ డైరెక్టర్ తమను బూతులు తిట్టాడని అనుకుని మూవీ లేడీ ప్రొడ్యూసర్ కి విషయం చెప్పారట. అప్పుడు ఆమె నవ్వి అసలు విషయం చెప్పిందట. అయితే తెలుగులో రండి అంటే గౌరవంగా పిలుస్తారని, కానీ హిందీలో అది పెద్ద బూతు అని కావ్య చెప్పుకొచ్చింది. రెండు వేరు వేరు అర్థాలు వచ్చే ఒకే పదంతో తను ఎలా ఇబ్బంది పడ్డానో తెలిపింది ఈ అమ్మడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com